Breaking : ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల..

-

ఏపీలో లాసెట్‌, పీజీ ఎల్‌ సెట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి . ఈ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ విడుదల చేశారు. న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ , రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 20న ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షలకు మొత్తం 16,203మంది హాజరయ్యారు. వీరిలో 13,402 మంది క్వాలిఫై అయినట్టు వీసీ వెల్లడించారు.

మూడేళ్ల బీఎల్‌/ఎల్‌ఎల్‌బీ కోర్సు కోసం లాసెట్‌లో కొవ్వూరు హర్షవర్దన్‌ రాజు ఫస్ట్‌ ర్యాంకులో నిలిచాడు. ఆ తర్వాతి ర్యాంకుల్లో గంగాధర్‌ కునపులి (ప్రకాశం జిల్లా), పితాని సందీప్‌ (కోనసీమ), అంబటి సత్యనారాయణ (ఏలూరు), పొల్లకట్ల లోకేశ్ (వైఎస్‌ఆర్‌ కడప) భవసాగర్‌ (నెల్లూరు), పుట్టా వీవీ సతీశ్ బాబు (కాకినాడ), దాసరి మెహర్‌ హేమంత్‌ (కృష్ణా), కోదండపాణి (బాపట్ల), కె.రాజశేఖర్‌ రెడ్డి (నంద్యాల) తర్వాత పది ర్యాంకుల్లో మెరిశారు.

 

లాసెట్‌లో ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష రాసిన వారిలో మరుపల్లి రమేశ్‌ (విశాఖ), చెన్నుపాటి లిఖిత (గుంటూరు), అలతుర్తి రవీంద్ర చారి (ప్రకాశం), ఎన్‌.నరసింహ (అనకాపల్లి), మైలపల్లి సాగర్‌ (అనకాపల్లి), కొండవీటి ఎలిజిబెత్‌ గ్రేస్‌ (ఎన్టీఆర్‌ జిల్లా), ఓం కారం వెంకట బిందు ( (నెల్లూరు), గంజి దేవిశ్రీ నీల (బాపట్ల), సాధ్విక్‌ వేముల (కరీంనగర్‌), దామల శ్రీహరి (నంద్యాల) టాపర్లుగా నిలిచారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version