అసెంబ్లీకి అరవింద్?

-

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారం దక్కించుకోవడమే బీజేపీ టార్గెట్…ఆ దిశగానే బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకెళుతుంది…టీఆర్ఎస్ పార్టీని ఎక్కడికక్కడ ఇరుకున పెట్టే రాజకీయాలు చేస్తుంది. అలాగే గ్రౌండ్ లెవెల్ లో బలం పెంచుకునే దిశగా బీజేపీ పనిచేస్తుంది. 119 నియోజకవర్గాల్లో బలమైన నాయకులని నిలబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇదే క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఇప్పుడు ఎంపీలుగా ఉన్న వారిని అసెంబ్లీ ఎన్నికల బరిలో దించడం ఖాయమని తెలుస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్ లు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది.

వీరిలో ఎలాగో కిషన్ రెడ్డి, బండి, సోయం…గతంలో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినవారే..కిషన్ రెడ్డి…అంబర్ పేట నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు…అయితే గత ఎన్నికల్లో ఓడిపోగా, నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి…కేంద్ర మంత్రి అయ్యారు. ఇక నెక్స్ట్ మళ్ళీ అంబర్ పేట బరిలోనే కిషన్ రెడ్డి దిగనున్నారు. అటు కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్…కరీంనగర్ లేదా వేములవాడలో గాని పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సోయం బాపూరావు…బోథ్ స్థానంలో దిగనున్నారు. ఈ ముగ్గురుకు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది.

కానీ ధర్మపురి అరవింద్…డైరక్ట్ ఎంపీగానే గెలిచారు. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో కవితని ఓడించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో అరవింద్ సైతం అసెంబ్లీ బరిలో దిగుతారని తెలుస్తోంది. ఎలాగో పార్లమెంట్ కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి…అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏదొక అసెంబ్లీ లో పోటీ చేయొచ్చని సమాచారం.

నెక్స్ట్ కేసీఆర్ ని గద్దె దించడం ముఖ్యం కాబట్టి..అరవింద్ లాంటి వారు అసెంబ్లీ బరిలో ఉండటం బీజేపీకి ప్లస్ అవుతుంది. ఎలాగో నిజామాబాద్ అర్బన్ పై ధర్మపురి ఫ్యామిలీకి పట్టు ఉంది…గతంలో ఇక్కడ డి. శ్రీనివాస్ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. లేదంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ లో బీజేపీకి మెజారిటీ వచ్చింది…కాబట్టి అక్కడైనా పోటీ చేయొచ్చు. లేదంటే టీఆర్ఎస్ లో దూకుడుగా ఉండే జీవన్ రెడ్డి..ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు…ఆయనకు చెక్ పెట్టాలంటే అరవింద్..ఆర్మూర్ బరిలో దిగే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఖాయమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news