మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన దేశవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా అభిమానులు ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు.
ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ కు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, తెలంగాణలోని గద్వాల్ జిల్లా కు చెందిన రామ్ చరణ్ వీరాభిమాని జైరాజ్ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.
చిన్న తనం నుంచి ఆర్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న జైరాజ్ మెగా హీరోలకు పెద్ద అభిమాని. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాలకు పెద్ద అభిమాని. ఈ క్రమంలోనే రామ్ చరణ్ పైన ఉణ్న ప్రేమను చూపేందుకు తన అభిమాన కథానాయకుడు అయిన రామ్ చరణ్ ఫొటోలను వరి పొలంలో పండించాడు.
గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి ప్రాంతంలో పొలాన్ని కౌలుకు తీసుకొని వరి నాట్లేసి మరీ రామ్ చరణ్ ముఖ చిత్రం కనబడేలా జాగ్రత్తలు తీసకున్నాడు. దీని కోసం వేల రూపాయలు ఖర్చు చేశారు. ఎత్తులో నుంచి చూస్తే చెర్రీ ఫొటో స్పష్టంగా కనిపించేలా మూడు నెలల పాటు శ్రమించాడు.
ఈ విషయం తెలిపేందుకు రామ్ చరణ్ ఇంటి వరకు సుమారు 265 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రామ్ చరణ్ ను అభిమాని స్వయంగా కలుసుకున్నాడు. చరణ్ వరి చిత్రాన్ని ఆయనకే అందించాడు. ఇక తన నివాసంలో రామ్ చరణ్ అభిమాని జైరాజ్ తో సుమారు 45 నిమిషాలు మాట్లాడారు. జైరాజ్ కళాత్మకంగా రూపొందించిన ఈ ఫొటోలను చెర్రీ కి చూపించి.. వారి గురించి వివరించారు.
పేరెంట్స్ ను కోల్పోయిన జైరాజ్ కు ఆర్థిక సహాయం చేసి అండగా ఉంటానని రామ్ చరణ్ భరోసా కల్పించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తగిన స్థానం కల్పిస్తాననీ చరణ్ మాట ఇచ్చారు. ఈ సందర్భంగా తనను గుర్తించి మద్దతుగా నిలిచిన చరణ్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని జైరాజ్ పేర్కొన్నాడు.
Shankar Sir’s huge comeback and Ram Charan is going to look so gorgeous in this movie no one will remember the plot (also he’s such a profoundly gentle soul bless him 🙏) pic.twitter.com/HxJ0Mv8U1p
— Rin (@GrinchReality) May 28, 2022