ఉల్లిపాయ,తేనె కలిపి తీసుకుంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

-

సాధారణంగా ఉల్లిపాయ, తేనె రెండింటిలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో పోషకాలు ఉన్నాయని అందరికి తెలిసిందే.ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు, అదే విదంగా తేనే కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.కానీ వాటిని విడివిడిగా తీసుకునే కన్నా, రెండిటిని కలిపి తీసుకుంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అవి రెండింటిని కలపి ఎప్పుడెప్పుడు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఉల్లిపాయలు బాగా మిక్సీ పట్టి రసం తీసుకోవాలి.ఇందులో తేనె కలిపి మిశ్రమం తయారు చేసుకొని ఈ వర్షాకాలం లో వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి వచ్చినప్పుడు ఉదయం, సాయంత్రం ఒక్కో టీ స్ఫూన్ చొప్పున తీసుకుంటే వాటి నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఉబకాయంతో బాధపడేవారు ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల అధిక కొవ్వును కరిగించడంలో బాగా సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకొనే వారు ప్రతిరోజు ఉల్లి రసం,తేనె కలిపి తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు.
మధుమేహం తో ఇబ్బంది పడేవారు ఉల్లి రసంలో తేనె కలుపుకుని ప్రతి రోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.అంతే కాక ఉల్లి రసం, తేనె కలిపి తీసుకోవడం వల్ల దంతసమస్యలకయినా మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది నాచురల్ యాంటీ బయటిక్ గా కూడా పనిచేస్తుంది.

ఉల్లిపాయ మరియు తేనె తీసుకోవడం వల్ల బీపీనీ కంట్రోల్ చేస్తుంది.రక్తంలో నిల్వవున్న కొవ్వులను, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే, ముఖముపై వచ్చే ముడతలు,మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తుంది.

శరీరంలో ఇమ్యూనిటీ పవర్ నీ పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా తీసుకోవటం చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. చిన్న పిల్లలకు ఈ మిశ్రమం మంచి టానిక్ లా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version