హెయిర్‌ ట్రీట్మెంట్‌ చేయించుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్‌ మీకోసమే..!

-

జుట్టు సమస్యలకు ఆయిల్స్‌, ఇంటిచిట్కాలు వాడే వారు కొందరైతే.. ఈ తలనొప్పి అంతా మనతోని కాదు.. ట్రీట్మెంట్‌ చేయించుకుందాం అనుకునేవళ్లు మరికొందరు. హెయిర్‌కు ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్‌ వచ్చేశాయి. కెరాటిన్, డీప్ కండిషనింగ్, స్మూత్నింగ్ తదితర హెయిర్ ట్రీట్‌మెంట్.. అయితే ఇలాంటివి తీసుకున్న తర్వాత మనం ఇంకేమీ చేయనవసరం లేదని అనుకుంటారు. హెయిర్ ట్రీట్ మెంట్ తర్వాత కూడా మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. జుట్టు చికిత్స తర్వాత ఏం చేయకూడదు? ఎలా జాగ్రత్త వహించాలో ఇప్పుడు చూద్దాం..!

జుట్టు చికిత్స తర్వాత మీరు ఉపయోగించే షాంపూ చాలా ముఖ్యం. మీరు సహజమైన విధానాన్ని అనుసరిస్తే ఇంకా మంచిది. కానీ ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూ వాడితే జుట్టు పాడైపోయి జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. మీ షాంపూ, కండీషనర్ సల్ఫేట్ లేకుండా ఉండేలా చూసుకోండి. హెయిర్ ట్రీట్ మెంట్ తర్వాత.. ఎక్కువ వేడిని జుట్టుకు తగలకుండా చుసుకోవాలి. జుట్టు నిటారుగా, మృదువుగా చేసేందుకు వేడి కావాల్సి ఉంటుంది. మీ జుట్టును స్టైల్ చేయడానికి కర్లర్‌ని లేదా ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్‌ని ఉపయోగించవద్దు. అలా చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. తలస్నానం చేసిన తర్వాత జుట్టును సహజంగా ఆరనివ్వండి. లేకపోతే మీ జుట్టు మరింత పొడిబారుతుంది. మృదుత్వాన్ని కోల్పోయి గరుకుగా మారుతుంది. అలాగే జుట్టు రాలడం మొదలవుతుంది.

వేడినీటి స్నానం…

వేడి నీళ్లతో తలస్నానం చేయకూడదు.. వేడి నీళ్లను తలపై పెట్టుకుంటే వెంట్రుకల కుదుళ్లు పాడవుతాయి. చల్లటి స్నానం చేయడం మీకు అలవాటు ఉండకపోవచ్చు. చల్లటి నీటిని తీసుకుంటే తలనొప్పి, ముక్కు మూసుకుపోయినట్లైతే గోరువెచ్చని నీటిని వాడండి. ఇలా హెయిర్ ట్రిట్ మెంట్ తీసుకున్న తర్వాత కచ్చితంగా కొన్ని టిప్స్ పాటించాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మీ జుట్టును రెండుసార్లు దువ్వండి.
జుట్టు చివర్లు చీలిపోయి ఉంటే చివరలను కత్తిరించండి.
ఎక్కువ క్లిప్‌లు పెట్టవద్దు.
తడి జుట్టు దువ్వకండి.
హెయిర్ సీరమ్ ఉపయోగించండి.
శాటిన్ దిండుతో నిద్రించండి.
స్నానం చేసిన తర్వాత మీ జుట్టును ఎక్కువగా ఆరబెట్టకండి.
వారానికోసారి జుట్టుకు నూనె రాసి అరగంట అలాగే ఉంచి రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలి.

ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది.. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులనే ఎంచుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version