ఒత్తిడితో జీవితాన్ని ఆనందించలేకపోతున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి. 

-

జీవనశైలిలో మార్పుల కారణంగానూ, తీరిక లేని పని మూలంగానూ ఒత్తిడి కలగడం సహజం. ప్రస్తుత తరంలో ఒత్తిడి లేని పని లేదంటే అతిశయోక్తి కాదు. ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే ఎక్కువ జీతం అన్నట్టుగా ఉంది ప్రస్తుత ఉద్యోగాల పరిస్థితి. ఈ పరిస్తితి అంత మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల వచ్చే ఆదాయాలు ఆ తర్వాత ఆరోగ్యపరంగా తేలేట్టే ఇబ్బందులను ఏమాత్రం తీర్చలేవు. అందుకే దేనికి ఎంత ఒత్తిడి తీసుకోవాలనేది మీరే ఆలోచింకుకోవాలి. అదలా ఉంచితే ప్రస్తుతం ఒత్తిడిని దూరం చేసుకుని ఆనందమాన్ని అక్కున చేర్కుకునే అవకాశాలను కనుక్కుందాం.

stress
stress

హాయిగా నిద్రపోండి

నిద్ర గురించి ఎవ్వరేమన్నా పెద్దగా పట్టించుకోవద్దు. కనీసం 6 నుండి 8గంటల నిద్ర చాలా అవసరం. నిద్ర వల్ల ఒత్తిడి దూరమవుతుంది. కానీ ఇక్కడ చిత్రమేమిటంటే ఒత్తిడి ఎక్కువైనపుడు నిద్ర దూరమవుతుంది. ఐతే రోజువారి మీ నిద్ర కావాల్సినంత సమయం ఉన్నట్లయితే ఒత్తిడి తగ్గుతుంది.

30నిమిషాల వ్యాయామం

రోజులో కనీసం 30నిమిషాలైనా వ్యాయామం చేయాలి. లేదా పరుగులాంటి నడక అయినా ఫర్వాలేదు. దీనివల్ల ఎండార్ఫిన్స్ విడుదలయ్యి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

ఇతరులతో మాట్లాడండి

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలనుకోవడం సహజమే. కానీ అలా కాకుండా దాని తగ్గించుకోవాలనుకున్నప్పుడు మాత్రం నలుగురిలో కలవండి. చిన్న చిన్న పార్టీలకు హాజరవ్వండి. ఇతరులకు సాయం చేయండి.

ప్రాముఖ్యతలు తెలుసుకోండి

చాలామంది ఒత్తిళ్ళకు కారణం తామనుకున్న పని అనుకున్న సమయంలో చేయకపోవడమే అయి ఉంటుంది. ఇలాంటి వాటికి ఒత్తిడి పడుతున్న కొద్దీ రోజూ అదే అలవాటుగా మారుతుంది. ఏదైనా సరే ఒక్కరోజులో నిర్మించలేరన్న సంగతి మర్చిపోవద్దు.

సానుకూలంగా ఆలోచించండి

పాజిటివిటీ పెంచుకోవాలి. నీవల్ల కాదన్న ఆలోచన స్థానే అవుతుందన్న దృక్పథం పెంచుకోవాలి. ప్రాక్టికల్ గా ఆలోచించండి.

ప్రొఫెషనల్ తో మాట్లాడండి

పైన చెప్పినవన్నీ చేస్తున్నా మీ ఒత్తిడిలో ఎలాంటి మార్పు లేనట్లయితే వెంటనే నిపుణులను కలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news