ఎండల వలన ప్రతి ఒక్కరూ కూడా ఏసికి అలవాటు పడిపోతున్నారు ఏసీ ని రోజంతా కూడా ఆన్ చేసి పెట్టుకుంటున్నారు. దానితో కొన్ని రకాల నష్టాలు తప్పవు. ఎక్కువగా ఏసీ రూమ్ లో ఉండడం లేదంటే ఏసీ బస్సు లేదా ట్రైన్ వంటి వాటిలో ట్రావెల్ చేయడం వలన కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. ఏసి వలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ కచ్చితంగా వస్తాయి మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం.. ఏసీ వలన వేడి అనిపించకుండా హ్యాపీగా ఉంటుంది కానీ ఏసీ వలన నోరు ఆరిపోతూ ఉంటుంది ఇరిటేషన్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఏసీ వలన డిహైడ్రేషన్ సమస్య కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏసీ కారణంగా ఎక్కువగా దాహం వేస్తుంది. ఎక్కువగా ఏసీ గది లో ఉండటం వలన తలనొప్పి సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఏసీ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వలన కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఏసీ ఎక్కువగా ఆన్ చేసి పెట్టుకున్నట్లైతే నీరసం బలహీనత వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని గంటల తరబడి ఏసీలో ఉండకూడదు అవసరం అయినప్పుడు మాత్రమే ఏసీని వాడుకోవడం మంచిది. ఏసీ లో ఎక్కువగా ఉండటం వలన ఈ నష్టాలు కలుగుతాయి కాబట్టి బాగా వేడిగా అనిపించినప్పుడు కాసేపు రిలీఫ్ ని పొందడానికి మాత్రమే ఏసీ ని ఉపయోగించండి లేకపోతే అనవసరంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది.