మైనార్టీల పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది : అసదుద్దీన్‌

-

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, కేంద్రప్రభుత్వం మైనార్టీల పట్ల వివక్ష చూపుతోందన్నారు . బీజేపీ మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తోందని ఆరోపించారు. రాజస్థాన్ కు చెందిన జునైద్, నసీర్లను చంపిన వారిని బీజేపీ ఎందుకు ఎన్ కౌంటర్ చేయడం లేదని ప్రశ్నించారు. బుల్లెట్లతో న్యాయం చేస్తామని నిర్ణయించినప్పుడు ఈ కోర్టులు దేనికని ప్రశ్నించారు. న్యాయస్థానాలను మూసి వేయండన్నారు.

‘మనకెందుకు కోర్టులు… చట్టం… సీఆర్‌పీసీ, ఐపీసీ ఎందుకు ఉన్నాయి. న్యాయ మూర్తులు ఎందుకు ఉన్నారు? మీరు ‘ఎన్‌కౌంటర్‌ హత్యలు’ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక న్యాయ మూర్తులు ఏం చేస్తారు? హంతకులను పట్టుకోవడం వరకే మీ పని. ఎవరైనా చంపితే జైలుకు పంపండి. కానీ.. ఇదేంటి. ఎవరైనా చంపితే.. బుల్డోజర్లతో వారి ఇళ్లను నాశనం చేయండి’ అని ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అంతకు ముందు.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించారు. “అసలు సమస్యల” నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్‌ కౌంటర్ చేసిందని ఆరోపించారు. తప్పుడు ఎన్‌ కౌంటర్లు చేయడం ద్వారా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీకి కోర్టులపై అస్సలు నమ్మకం లేదని అఖిలేష్ విమర్శించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version