నెల్లూర్ లో దారుణం..లారీ ఢీ కొట్ట‌డం తో వాగులో పడిపోయిన ఆటో 3 మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లోని నెల్లూర్ జిల్లా దారుణం చోటు చేసుకుంది. జిల్లా లోని సంగం వ‌ద్ద ఆటో ను లారీ వేగం గా వ‌చ్చి ఢీ కొట్టింది. దీంతో ఆటో ప‌క్క‌న ఉన్న వాడు లో ప‌డిపొయింది. ఈ ఘ‌ట‌న నిన్న రాత్రి జ‌ర‌గగా .. ప్ర‌మాదం సమ‌యంలో ఆటో లో 12 మంది ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే వాగు లో వ‌ర‌ద ఎక్కువ గా ఉంట‌డం లో ఆటో లో ఉన్న వారు కొట్టుకుపోతుండగా.. స్థానికికులు కాపాడ టానికి ప్ర‌య‌త్నించారు.

ఎట్ట‌కేల‌కు ఏడుగురి ని స్థానికులు, పోలీసులు క‌ల‌సి రక్షించారు. కాగ ఐదుగురు గ‌ల్లంతు అయ్యారు. అందులో ఓ బాలిక శ‌వం గా దొరికింది. తెల్లవారు జామున మ‌రో రెండు మృత దేహాలు ల‌భ్యం అయ్యాయి. దీంతో ఈ ఘ‌ట‌న లో మ‌ర‌ణించిన వారి సంఖ్య మూడు కు చేరింది. అయితే మ‌రో ఇద్ద‌రి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌ల‌ను కొన‌సాగి స్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version