చంద్రబాబు ఇళ్లు, టీడీపీ ఆఫీస్‌పై దాడి.. సుప్రీం విచారణ వాయిదా!

-

గత వైఎస్సార్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఇళ్లు, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అసహనుద్దీన్ అమానుల్లాహ్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్‌లతో పాటు పలువురు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వురులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు రీ జాయిండర్ దాఖలు చేసే వరకు కాస్త టైం కావాలని నిందితుల తరపు లాయర్లు ధర్మాససనాన్ని కోరారు. దీంతో ఈ కేసు విచారణను డిసెంబర్ 17కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకూ నిందితులకు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న ఉపశమనం కొనసాగుతుందని తెలిపింది. కాగా, ఈ రెండు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు తమ పాస్ పోర్టులను వెంటనే దర్యాప్తు అధికారికి అందించాలని, నిందితులు విచారణకు సహకరిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి సెప్టెంబర్ 13న సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version