అవతార్‌ 2 రికార్డుల ప్రకంపనలు.. తొలిరోజు బుకింగ్స్‌ ఎంతో తెలుసా..?

-

ప్రపంచమంతటి దృష్టీ ఇప్పుడు త్వరలో విడుదల కానున్న అవతార్ 2పై ఉంది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. అవతార్-2 విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్ లో ఈ నెల 16న అవతార్-2 రిలీజ్ కానుండగా, అడ్వాన్స్ బుకింగ్ లు ప్రారంభమయ్యాయి. కొద్దిసమయంలోనే భారీస్థాయిలో టికెట్లు అమ్ముడవడం ఈ చిత్రంపై భారత అభిమానుల్లో ఉన్న క్రేజ్ ను చాటుతోంది. తొలిరోజు ప్రదర్శనలకు ఇప్పటిదాకా 2 లక్షల టికెట్లు అమ్ముడు కాగా, ఆలిండియా వైడ్ రూ.7 కోట్ల గ్రాస్ వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కేజీఎఫ్-2, బాహుబలి-2 చిత్రాలు ఈస్థాయి వసూళ్లు రాబట్టగా, ఇప్పుడు అవతార్-2 చిత్రం కూడా వాటి సరసన చేరింది.

వీకెండ్ టికెట్ల అమ్మకాల్లోనూ అవతార్-2 అదిరిపోయే అడ్వాన్స్ వసూళ్లు సొంతం చేసుకుంది. శని, ఆది వారాల్లో ఈ సినిమా ప్రదర్శనలకు 4.10 లక్షల టికెట్లు అమ్ముడైంది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్ వసూలైనట్టు అంచనా. కేవలం అడ్వాన్స్ బుకింగ్ ల రూపంలోనే అవతార్-2 దాదాపు రూ.80 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలున్నాయి. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.28 వేల కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా అవతార్-2: ద వే ఆఫ్ వాటర్ పేరుతో వస్తోంది. ఇందులో శామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్, కేట్ విన్ స్లెట్, స్టీఫెన్ లాంగ్ తదితరులు నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version