28,907 కోట్ల నష్టంలో విమానయాన పరిశ్రమ.. కేంద్రం కీలక ప్రకటన

-

రూ. 28,907 కోట్ల నష్టాల్లో విమానయాన పరిశ్రమ ఉందని అన్నారు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వికేసింగ్. లోక్సభలో మాల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నకు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. విమానయాన పరిశ్రమకు గత మూడేళ్లలో రూ. 28,907 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ డాక్టర్ వీకే సింగ్(రిటైర్డ్) వెల్లడించారు.

lok-sabha

ఈ మేరకు గురువారం లోకసభలో మాల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వీకే సింగ్ సమాధానమిచ్చారు. విమానయాన పరిశ్రమకు 2021-22లో రూ. 11658 కోట్లు, 2020-21లో రూ.12,479 కోట్లు, 2019-20లో రూ.4,770 కోట్ల నష్టం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై వ్యాట్ తగ్గించడం, ఎయిర్ పోర్ట్ నిర్వహణ సంబంధిత అంశాలపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించడం వంటి చర్యలు చేపట్టినట్లు సింగ్ తెలిపారు.

అంతేకాకుండా నూతన టెర్మినల్స్ నిర్మాణం, విస్తరణకు సంబంధించి వచ్చే ఐదేళ్లలో రూ. 98 వేల కోట్లు ఖర్చు చేయాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. విమానయాన సంస్థలకు సులభంగా రుణాలు లభించేందుకు వీలుగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ ను కూడా ప్రభుత్వం ఆమోదించినట్లు వీకే సింగ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version