ఏవీఎస్ వారసుడు దర్శకుడిగా వచ్చేస్తున్నాడు.. త్వరలో రిలీజ్..!!

-

ప్రముఖ హాస్యనటుడు, దర్శకుడు స్వర్గీయ ఏవీఎస్ తనయుడు ప్రదీప్ సైతం తండ్రి బాటలోని సాగుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించిన ఏ. ప్రదీప్ ఇప్పుడు దర్శకుడిగా కూడా మారాడు. ఖయ్యూమ్, నవీన్ నేని, రాయిల్ శ్రీ , చింటూ, శాంతి దేవగుడి , రామ్ జగన్ , చిత్రం శ్రీను తదితరులు ప్రధాన పాత్రదారులుగా భళా చోర భళా అనే సినిమాలు తెరకెక్కించారు. ఇక యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకేకుతున్న ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రాన్ని ఏ జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు . ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 26వ తేదీన విడుదల కానున్నట్లు వెల్లడించారు

ఇకపోతే ట్రైలర్ ను విడుదల చేసిన సందర్భంగా నటుడు ఆలీ సోదరుడు ఖయ్యూమ్ మాట్లాడుతూ .. ఇది కంప్లీట్ నెపోటిజం మూవీ అనవచ్చు. ఎందుకంటే ఇందులో అందరం సీనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన వాళ్లనే ఉన్నాము. ప్రదీప్ నాకు ఏవీఎస్ గారి అబ్బాయిగా 20 సంవత్సరాల క్రితమే తెలుసు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఇక ఆ స్నేహంతోనే ఇద్దరం కలిసి పనిచేయాలని అనుకున్నాము. కరోనా సమయంలోనే ప్రదీప్ నాకు స్టోరీ చెప్పారు.. వినగానే నాకు బాగా నచ్చింది. ఇక కథ నచ్చిన రెండవ రోజు నుంచి షూటింగ్ అన్నాడు.. 9 డేస్ 8 నైట్స్ లో షూట్ కంప్లీట్ చేసి రెండు నెలల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేశాము. ఇది ఒక మంచి సినిమా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను అంటూ తెలిపారు.

వీరితోపాటు మరి ఎంతోమంది ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ప్రదీప్ మాట్లాడుతూ మా నాన్న ఏవీఎస్ గారిపై ఉన్న అభిమానంతో సినిమా వారందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన లేకపోయినా మాకు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమా ఆగస్టు 26వ తేదీన మా అమ్మ గారి పుట్టినరోజు కానుకగా విడుదల చేయబోతున్నాము అంటూ ప్రదీప్ వెల్లడించారు.
.

Read more RELATED
Recommended to you

Exit mobile version