బిజెపి నేతలు గాడిదలు,కుక్కలు… దమ్మున్న మగాళ్లు అయితే తేల్చుకుందాం రండి : టిఆర్ఎస్ ఎంపీ

-

బిజెపి నేతలు గాడిదలు,కుక్కలు అంటూ రెచ్చిపోయారు టిఆర్ఎస్ ఎంపీ నేతకాని వెంకటేష్. ఆయన మీడియా తో మాట్లాడుతూ.. మతోన్మాద శక్తులు అయిన బీజేపీ ఎంపీ లు, నాయకులు కుక్కలులా అరుస్తున్నారని ఫైర్ అయ్యారు. భారత రాజ్యాంగము ను బీజేపీ రాజ్యాంగం గా మారుస్తున్నారని.. అంబేద్కర్ ను అడ్డుపడ్డ చరిత్ర ఈ బీజేపీ నాయకులుదని ఫైర్ అయ్యారు. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేస్తే అడ్డుకుని పోటీ పెట్టిన చరిత్ర కాంగ్రెస్ దని ఆగ్రహించారు.

బీజేపీ ప్రభుత్వం దళితులు కి ఏమి చేసింది ? అని నిలదీశారు. బీజేపీ ఎంపీలు కు దమ్మున్న మగాళ్లు అయితే చర్చ కి రావాలని సవాల్ విసిరారు. అంబేద్కర్ ని అవమానపరిచిన చరిత్ర బీజేపీ గాడిదలదని నేతకాని వెంకటేష్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రోజు ఆరుగురు మహిళలు అత్యాచారం కి గురి అవుతున్నారని మండిపడ్డారు. గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్ దళితులు గురించి చాలా దారుణంగా మాట్లాడాడని.. దళితులు గురించి మాట్లాడితే నాలుక చీరెస్తామని హెచ్చరించారు నేతకాని వెంకటేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version