బాబు మోహన్ బూతుపురాణం వైరల్..బండి సంజయ్ ఎవడ్రా అంటూ !

-

బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే బాబు మో హన్ బూతు పురాణం బయటపడింది. ఫోన్ చేసిన ఆందోల్ నియోజకవర్గ బిజెపి కార్యకర్త వెంకట రమణని బండ బూతులు తిట్టాడు బాబు మోహన్. మీతో కలిసి పార్టీలో పని చేస్తానని చెప్పిన కార్యకర్త… నేను మంత్రిగా ఉన్నప్పుడే ఆందోల్ ని అభివృద్ధి చేశానని చెప్పాడు బాబు మోహన్. నువ్వెంత నీ బతుకెంత అంటూ కార్యకర్తను తిట్టాడు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్.


నేను రెండు రాష్ట్రాల్లో పని చేయాలని అమిత్ షా నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నారన్న బాబుమోహన్…నేను ప్రపంచ స్థాయి నాయకుడిని అంటూ కార్యకర్తపై బాబు మోహన్ తిట్ల పురాణంతో రెచ్చిపోయారు. బండి సంజయ్ ఎవడ్రా..వాడు నా తమ్ముడు అన్నాడు బాబు మోహన్. ఇంకో సారి నాకు ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పు తీసుకుని కొడుతా అంటూ కార్యకర్తను బెదిరించారు. అవసరం అయితే రేపే బిజెపికి రాజీనామా చేస్తానని చెప్పిన బాబు మోహన్.. నువ్వు కావాలా..నేను కావాలా అంటూ పార్టీ తేల్చుకుంటుంది అంటూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఆడియో.

Read more RELATED
Recommended to you

Exit mobile version