నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకెళుతున్న విషయం తెలిసిందే…ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే కోణంలో బాబు పనిచేస్తున్నారు..ఎందుకంటే ఈ సారి గాని అధికారం దక్కించుకోకపోతే టీడీపీ ఉనికికే ప్రమాదమనే విషయం బాబుకు కూడా బాగా తెలుసు…అందుకే ఆయన ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధమైపోతున్నారు..అలాగే టీడీపీ శ్రేణులని సైతం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటినుంచే అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేసేస్తున్నారు.
ఇప్పటికే చంద్రబాబు పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేసిన విషయం తెలిసిందే…ఇదే క్రమంలో పలు ఫ్యామిలీలకు సైతం బాబు సీట్లు ఫిక్స్ చేసేశారు. పరిటాల ఫ్యామిలీకి రెండు సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే…రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పోటీ చేయనున్నారు. అలాగే జేసీ ఫ్యామిలీకు కూడా రెండు సీట్లు ఫిక్స్ అయ్యాయి. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతపురం పార్లమెంట్‌లో జేసీ పవన్ రెడ్డి పోటీ చేస్తారు.
అలాగే కోట్ల ఫ్యామిలీ నుంచి…ఆలూరులో కోట్ల సుజాతమ్మ, కర్నూలు పార్లమెంట్‌లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారు. అటు భూమా ఫ్యామిలీ నుంచి..ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పోటీకి దిగుతారు. ఇక కింజరాపు ఫ్యామిలీ నుంచి టెక్కలిలో అచ్చెన్నాయుడు..శ్రీకాకుళం పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తారు. రాజమండ్రి సిటీలో రామ్మోహన్ బావ ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీకి దిగనున్నారని తెలుస్తోంది.
ఇక పూసపాటి ఫ్యామిలీ నుంచి…విజయనగరం అసెంబ్లీలో అతిథి గజపతిరాజు, విజయనగరం పార్లమెంట్‌లో అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారు. అలాగే అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ ఫ్యామిలీలు రెండు సీట్లు ఆశిస్తున్నారు. అయ్యన్నకు ఎలాగో నర్సీపట్నం సీటు ఉంది..ఇక తన కుమారుడు విజయ్‌కు అనకాపల్లి ఎంపీ సీటు కావాలని అడుగుతున్నారు. ఇటు నెహ్రూకు జగ్గంపేట సీటు ఉంది..అయితే తన కుమారుడు నవీన్‌కు కాకినాడ ఎంపీ సీటు అడుగుతున్నారు. మరి వీరికి కూడా బాబు సీట్లు ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.