ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. కొత్త చార్జీలు అమలులోకి..!

-

ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఖాతా ఉన్న కస్టమర్లుకి పెద్ద ఝలక్ ఇచ్చింది ఈ బ్యాంకు. ఇకమీదట డబ్బును ఏటీఎం మెషీన్‌ ద్వారా బ్యాంక్ ఖాతా‌లో డిపాజిట్ చేయాలని అనుకుంటే మీరు బ్యాంక్‌కు రూ.50 చెల్లించుకోవాలి. అంటే మీరు ఎన్ని సార్లు డబ్బులు డిపాజిట్ చేస్తారో అన్ని సార్లు రూ.50 మీ అకౌంట్ నుండి కట్ అవుతాయి. ప్రైవేట్ రంగంలో ప్రముఖ ప్రఖ్యాత బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు ఒక షాకిచ్చింది. బ్యాంక్ కస్టమర్ల నుంచి కొత్తగా చార్జీలు వసూలు చేస్తోంది. కన్వీనియన్స్ ఫీజు కింద కస్టమర్ల నుంచి రూ.50 తీసుకుంటుంది. కానీ ఇది ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది.

బ్యాంక్ సెలవులు, బ్యాంక్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఏటీఎం మెషీన్‌కు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేస్తే కన్వీనియన్స్ ఫీజు కింద రూ.50 మీ అకౌంట్ నుంచి బ్యాంక్ కట్ చేసుకుంటుంది. మీరు చేసే ప్రతి లావాదేవీకి ఈ చార్జీలు వర్తిస్తాయి. అంటే మీరు రెండు సార్లు ఏటీఎం మెషీన్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే.. రూ.100 చెల్లించుకోవాలి.

ఏటీఎం మెషీన్‌లో క్యాష్ డిపాజిట్‌కు సంబంధించి ఒక్కో లావాదేవీకి కన్వీనియన్స్ ఫీజు కింద రూ.50 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. నవంబర్ 1 నుండి ఈ కొత్త చార్జీల విధింపు అమలులోకి వస్తుంది. అంతేకాకుండా, క్యాష్ యాక్సెప్టర్, రిసైక్లర్ మెషీన్లలో నెలకు రూ.10,000కు పైగా డబ్బులు డిపాజిట్ చేయాలని భావించినా కూడా ఈ కన్వీనియన్స్ చార్జీలు తప్పవు. కానీ కొంత మంది కస్టమర్లకి ఐసీఐసీఐ బ్యాంక్ కొంత ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్స్ సహా బేసిక్ సేవింగ్స్ అకౌంట్, జన్ ధన్ అకౌంట్ కలిగిన కస్టమర్లుకి మాత్రం ఈ కన్వీనియన్స్ చార్జీలు పడవు . అంటే వీరికి ఈ చార్జీలు వర్తించవు. వీళ్ళకే కాకుండా స్టూడెంట్ అకౌంట్స్, వికాలంగులకు కూడా ఈ చార్జీలు వర్తించవు. మిగితావారికి ఈ బాదుడు తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version