డిజిటిల్ ప్లాట్ ఫార్మ్స్ పై ఫైరవుతున్న బడా హీరోలు

-

డిజిటిల్ ప్లాట్ ఫార్మ్స్ పై బడా హీరోలు గుర్రుగా ఉన్నారు. సినిమా స్ట్రీమింగ్ అవ్వడానికి ముందు.. హీరోహీరోయిన్లుతో పాటు టెక్నీషియన్స్ ఆ సినిమా తాలుకు డిజిటల్ ప్రమోషనల్లో పార్టిసిపేట్ చేయాలని షరతులు పెట్టడం మన హీరోలకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ కండిషన్స్ హీరోల ఇగోలను ఇబ్బంది పెట్టేలా ఉండడంతో ఓటీటీలు టాప్ హీరోల విషయంలో వర్కవుట్ అయ్యే మ్యాటరేనా అనిపిస్తుంది.

సినిమా థియేటర్లలో విడుదల కావడానికి ముందు హీరోహీరోయిన్లు, దర్శకులు…. బయ్యర్లు,డిస్ట్రిబ్యూటర్ల కోసం ఫ్రీ పబ్లిసిటీ చేస్తారు.థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నవారికోసం మన స్టార్ క్యాస్ట్ అలా ప్రమోషన్లో పార్టిసిపేట్ చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ.అందుకే మహేష్ ,తారక్ ,చెర్రీ,బన్నీలతో పాటు పలువురు టాపర్లు ప్రమోషన్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు.

ఇక ఓటీటీల దగ్గరికి వచ్చేసరికి సీన్ మరోలా కనిపిస్తుంది.థియేటర్ రైట్స్ తీసుకున్నవారికోసం స్టార్ క్యాస్ట్ ఎలా అయితే ఫ్రీ పబ్లిసిటీ చేస్తారో అదే రీతిలో డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినందుకు మాకు కూడా ప్రచారం చేసి పెడతారని ఓటీటీలు ఆశించాయి.దానిలో భాగంగా కండిషన్ పెట్టాయి. ఆన్ లైన్ యాప్ ల ద్వారా ఇంటర్వ్యూలు ఇవ్వడం.. ఏ రోజున సినిమా రాబోతోందో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం.. ఇలాంటివి అన్నమాట. ఐతే వీటికి మాత్రం మన బడా హీరోలు అంతగా ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది.

ఓటీటీలు ఇక్కడితోనే సరిపెట్టకుండా న్యూస్ పేపర్స్ లో టీవీల్లోనూ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవ్వబోతోందో అని ఇచ్చే యాడ్స్ ఖర్చు నిర్మాతలే భరించాలి.యాడ్స్ ఇవ్వడానికి నిర్మాతలకు అభ్యంతరం లేకపోవొచ్చు. అయితే హీరోలు మాత్రం పబ్లిసిటీకి నో అంటున్నారని తెలుస్తుంది. ధియేటర్లో సినిమా విడుదల చేస్తానంటే ఎంతైనా పబ్లిసిటీ చేస్తాం..కానీ ఇలా ఓటీటీకి పబ్లిసిటీ ఇవ్వమంటే కుదరదని తెగేసి చెప్తున్నారట.దీంతో సౌడ్ బడా హీరోలతో ఓటీటీలకు అంతగా వర్కవుట్ అవ్వదనే మాట మళ్లీ హైలెట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version