ఆ సమయంలో ప్రధాని మోదీకి, బాల్ ఠాక్రే మద్దతుగా నిలిచారు: ఉద్ధవ్ ఠాక్రే

-

మహారాష్ట్ర సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేాదాలు తారాస్థాయి చేరాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల భాగస్వామ్యంతో మహావికాస్ అఘాడీ పేరుతో ఉద్దవ్ ఠాక్రే సీఎంగా మహారాష్ట్రలో అధికారంలో ఉన్నారు. ఇటీవల శివసేన, బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఎన్సీబీ వంటి సంస్థలతో పలువురు శివసేన, ఎన్సీపీ కు చెందిన రాజకీయ నాయకులపై దాడులు చేస్తోంది. 

ఇటీవంటి పరిణామాల మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే. 2002 గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని గద్దె దించాలంటూ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో మోదీకి బాల్ ఠాక్రే మద్దతు ఇచ్చాడని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. మరాఠీ దిన పత్రిక లోక్ సత్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అద్వానీ ముంబైకి ఓ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చారని.. బాల్ ఠాక్రేతో మోదీ విషయంపై చర్చించారని ఆయన వెల్లడించారు. “మోదీని ముట్టుకోకూడదని బాలాసాహెబ్ అద్వానీ జీతో చెప్పారని, మోడీని తొలగిస్తే, (బీజేపీ) గుజరాత్‌ను కోల్పోతుందని, దాని వల్ల హిందుత్వ దెబ్బతింటుందని” అని బాల్ ఠాక్రే అన్నట్లు సీఎం ఉద్దవ్ ఠాక్రే వెల్లడించారు. అయితే మోదీపై గౌరవం ఉందని… అంత మాత్రాన బీజేపీతో జట్టుకట్టడం లేదని.. ఇది తన వ్యక్తిగతం అభిప్రాయం అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version