విద్యతెలియని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం దురదృష్ణకరమని సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు.బాలకృష్ణ ఎవరో ఇచ్చిన స్క్రీప్టును చదివారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు తగ్గాయన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై తాను చర్చకు సిద్ధమని అన్నారు. అందుకు బాలకృష్ణ సిద్ధమా అని మంత్రి బొత్స సవాల్ విసిరారు. ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యావ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని తెలిపారు.
టోఫెల్, ఇంగ్లీష్ మీడియం వంటి విధానాలతో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. పేదలందిరికీ విద్యనందించడమే తమ లక్ష్యమని తెలిపారు.కొందరు కుట్ర చేయడం వల్లే పింఛన్లు సమయానికి ఇవ్వలేని పరిస్థితి ఉందని, వృద్ధుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు.భూమిపై యజమానులకు పూర్తి భద్రత కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని మంత్రి బొత్స తెలిపారు. ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోర్టు ఉందని, తీర్పు వచ్చిన తర్వాతే అమలుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.