నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి.పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఇక ఇందులో యాక్షన్ సన్నివేశాల ఎలివేషన్స్ బోయపాటిని సైతం దాటిపోయాయని టాక్ నడుస్తోంది ఆ సినిమాకి పని చేసిన స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలోనే గోపీచంద్ మలినేని అన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో ఫైట్స్ లో బాలయ్య అఖండ ను మించిన ఎనర్జీ తో చేశారని అంటున్నారు. అలాగే సినిమా లో వరలక్ష్మి శరత్ కుమార్ తో వచ్చే సీన్ పంచ్ డైలాగ్స్ తో అదిరిపోతుందట. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే తనని విపరీతంగా అభిమానించే రాయల సీమ లోనే తదుపరి షూటింగ్ జరగనుంది ఈ సినిమా షూటింగ్ అనంతపురం జిల్లాలో ని రకరకాల లొకేషన్స్ లో జరగ బోతుంది.
నవంబర్ 9న పెన్నోబిలం లక్ష్మి నరసింహ స్వామి గుడి వద్ద అలాగే 10,11 న అమిద్యాల, రాకెట్ల అలాగే ఉరవకొండ ప్రాంతాల్లో జరగనుంది. ఇక తర్వాత 12 మరియు 13 తేదీల్లో ఈ చిత్రం పెనుగొండ కోట వద్ద షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలే బాలయ్య బాబు కు మాస్ మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో ఒక చోట వరదలు వచ్చినప్పుడు ఒక అభిమాని బాలయ్య ను చూడటానికి ప్రాణాలకు తెగించి వాగులో దూకాడు. ఇప్పుడు షూటింగ్ అనంతపురం జిల్లాలో అంటే దబిడి దిబిడే.!