బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం… డైరెక్టర్ల అభినందనలు

-

1982లో టీడీపీని స్థాపించినప్పటి నుంచి బాలకృష్ణ ప్రతి ఎన్నికలలో ఎన్టీఆర్, చంద్రబాబు కోసం ప్రచారం చేశాడు. 2014 వరకు ఎన్నికల బరిలోకి దిగలేదు. మొదటిసారిగా 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రత్యర్థి బి. నవీన్ నిశ్చల్పై హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి 16,196 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.అలాగే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హిందూపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి షేక్ మహమ్మద్ ఇక్బాల్పై ఘనవిజయం సాధించారు.

ఇక ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఫలితాలలోను హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు టాలీవుడ్ డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించినందుకు బాలయ్యను డైరెక్టర్లు గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ కలిసి అభినందించారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే గోపీచంద్ డైరెక్షన్లో వీరసింహారెడ్డి, అనిల్ దర్శకత్వంలో భగవంత్ కేసరి చిత్రాల్లో ఆయన నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version