నెక్స్ట్ సినిమాల కోసం భారీ ప్లాన్ వేస్తున్న బాలయ్య.. వర్కౌట్ అయ్యేనా..?

-

నటసింహ నందమూరి బాలకృష్ణ అనగానే వెంటనే గుర్తుచేది మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు ఈ చిత్రాల ద్వారా ఆయన ఏ రేంజ్ లో ప్రేక్షకులను అనురిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. ఇంకొక వైపు మాసివ్ కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ కి తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కించే విధంగా ఆయన జాగ్రత్త పడుతున్నారు. అందుకోసమే ఇప్పుడు స్క్రిప్ట్ లను పరిశీలించే పనిలో భాగంగా ఇద్దరు డైరెక్టర్లు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారట .

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలయ్య సినిమా చేస్తున్నారు అంటే అందులోనూ ఆ సినిమాలు ఎలక్షన్ సీజన్ ని టార్గెట్ చేశాయంటే కచ్చితంగా ఆ డైలాగులు ఎలా ఉండాలి ? పంచులు ఏ రేంజ్ లో పేలాలి? అన్న విషయాలపై అభిమానులలో భారీగా డిస్కషన్ జరుగుతోంది.అసలు విషయంలోకెళితే ఇకపై మాస్ చిత్రాలు కాకుండా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించబోతున్నారట బాలయ్య. అందులో భాగంగానే బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో పొలిటికల్ పంచ్ లు, ఫ్యాన్స్ కడుపు నింపేలా ఉంటాయన్నది సమాచారం. ఇక మరొకవైపు బోయపాటి మాత్రమే కాదు నా సినిమాలో కూడా రాజకీయాలకు సంబంధించిన స్టఫ్ వుంటుందని చెబుతున్నారు బాబి..

బాలయ్యతో సినిమాలంటే ప్రేక్షకులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో నాకు బాగా తెలుసు.. అందుకే అలాంటి స్టఫ్ ని ఫస్ట్ నుంచి జాగ్రత్తగా యాడ్ చేసుకుంటున్నాను అని చెబుతున్నారు డైరెక్టర్ బాబీ. ఇకపోతే ఈ ఏడాది విడుదలైన వీర సింహారెడ్డి సినిమాలో కూడా పొలిటికల్ పంచ్ లకు కొదవేలేదు. మరి ఇప్పుడు రాబోతున్న సినిమాలు ఏ విధంగా పాలిటిక్స్ ను టార్గెట్ చేస్తున్నాయో తెలియాల్సి ఉంది. మరి బాలయ్యకు ఈ రేంజ్ సినిమాలు ఏ విధంగా వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version