అందుకే అందరు అంటారు జై బాలయ్య అని..!!

-

ఇప్పుడు వున్న సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ గురించి చాలా మంది ఆయన చాలా కోపిష్టి అని అంటూవుంటారు.వాస్తవానికి ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. కాని షూటింగ్, పని విషయం లో ఆయన చాలా ప్రొఫెషనల్ గా వుంటారు. ఇది వారి తండ్రి గారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుండి వారసత్వం వచ్చింది. నటీ నటులకు , టెక్నీషియన్లకు ఆయన చాలా గౌరవం ఇస్తారు.

స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కూడా బాలయ్య వ్యక్తిత్వం నచ్చి బాలయ్య తో మరో సినిమా తీయాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇప్పుడు చాలా మంది అన్ స్స్టాపబుల్ షో లో నిజమైన బాలయ్యను చూసి అసలు నిజం తెలుసుకొని పిదా అయ్యారు. అలాగే చిత్ర పరిశ్రమలో చాలా మందికి బాలయ్య గురించి తెలుసు. అలాంటి ప్రముఖ నటుడు కాశీ విశ్వనాథ్ బాలకృష్ణ గొప్పదనం గురించి ఒక ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలు చెప్పారు

బాలయ్య బాబు ఎమ్మెల్యేగా, క్యాన్సర్ ఆస్పత్రిలో  చాలా మంచి పనులు చేస్తున్నాడని అన్నారు. ఇన్ని పనులు మధ్య కూడా ఆయన హుషారుగా నటిస్తూ వుంటారని అది అందరికీ రాదని అన్నారు. అలాగే మాట మీద నిలబడే మనస్తత్వం వున్న బాలయ్య, నిలబడని వారిపై కోపగించు కుంటారని, అదీ కూడా వెంటనే తగ్గి పోయి మళ్లీ నార్మల్ అయిపోతారు అని చెప్పుకొచ్చారు. షూటింగ్ లో కూడా కార్ వాన్ వున్నా కూడా నేల మీద చాప వేసుకొని పడుకుంటారని , అలాగే ఆయన ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్ తోనే వుంటారని అలాంటి వాళ్ళు చాలా అరుదు అని కాశీ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version