“ట్విట్టర్ టిల్లు” అంటూ కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్

-

“ట్విట్టర్ టిల్లు” అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చాడు. ED చీఫ్‌గా బండి సంజయ్‌ ని నియమించినందుకు తెలంగాణ మంత్రి వర్యులు కేటీఆర్‌ నిన్న మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ ” ప్రియమైన @PMOIndia. మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ని కూడా ED చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు 👏👏ఈ దేశాన్ని నడిపే డబుల్ ఇంజన్ నిజానికి “మోడీ & ఈడీ” అని ఇప్పుడు మేము గ్రహించాము.” అంటూ ఈ ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. అయితే.. కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ కు తాజాగా బండి సంజయ్‌ కూడా రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చాడు.

“దొంగల్లో ముఖ్యంగా ట్విట్టర్‌ టిల్లులో భయం ఎక్కువగా కనిపిస్తోంది. ఆందోళన, అయోమయం అనుభవంలోకి వస్ఉతన్న వారికి యోగా మంచింది. విచారణ సంస్థలు మీ తలుపు తట్టే వరకు గాలిని లోపలికి తీసుకోవడం మంచింది” అంటూ ఓ రేంజ్‌ లో సెటైర్‌ వేశారు బండి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్విట్టర్‌ టిల్లు అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌ లోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version