సీఎం కేసీఆర్ కు బీజేపీ ఛీఫ్ బండి సంజయ్ లేఖ.. పంచాయతీ కార్యదర్శులను రెగ్యలర్ చేయాలని డిమాండ్

-

పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్ అమలు చేయడంతో పాటు.. వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరుతూ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో 12657 పంచాయతీల్లో పనిచేస్తున్నారని వారి సమస్యలను పరిష్కరించాలని లేఖలో సీఎం ని కోరారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని లేఖలో పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ నుంచి దోమల నివారణ వరకు పది రకాల పనులు నిర్వహిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. అయినా వీరికి నిత్యం అనుమానాలు ఉన్నతాధికారులు తప్పడం లేదని పేర్కొన్నారు. కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శుల పై భౌతిక దాడులు జరుగుతున్నాయన్నారు. దీంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లేఖలో చెప్పారు. పంచాయతీ కార్యదర్శుల మనోధైర్యం ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత… వీరి ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వడం.. ఖచ్చితమైన పనిగంటలు నిర్ణయించడం, రోజువారీ పనికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర డిమాండ్ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version