విద్యుత్‌రంగంలో హైదరాబాద్‌ను పవర్‌ఐలాండ్‌గా మార్చామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోసిపుచ్చారు. చినుకు పడితే అంధకారమయ్యే హైదరాబాద్ పవర్ ఐలాండ్‌గా మారిందనడం హస్యాస్పదంగా ఉందని విమర్శించారు బండి సంజయ్. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బండి సంజయ్. బీఆర్ఎస్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయలేదో సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చి ప్రజలను బిచ్చగాళ్లను చేయడమేనా తెలంగాణ మోడల్ అని ప్రశ్నించారు బండి సంజయ్. ఒకే కుటుంబం లక్ష కోట్లు దోచుకోవడమెలా…. అనేది దేశానికి చాటిచెప్పడమేనా తెలంగాణ మోడల్ అంటే అని నిలదీశారు బండి సంజయ్. ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు బండి సంజయ్.