తెలంగాణ బీజేపీ చేవేళ్లలో విజయ సంకల్ప సభ పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. పోలీసులు తనను అరెస్ట్ చేసి ఎనిమిది గంటలు రోడ్లపై తిప్పారని.. దీంతో ఢిల్లీ నుండి ఫోన్ వచ్చిందని తెలిపారు.
ఢిల్లీ నుండి పులి ఫోన్ చేయడంతో పోలీసులు భయపడ్డారని అన్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడే ఆ పులి ఇప్పుడు చేవేళ్ల గడ్డపై అడుగు పెట్టిందని అమిత్ షాపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో బీజేపీ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని.. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత వైద్యం, విద్య అందిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్.
కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మారిండంటూ … ప్రజా సమస్యలపై గళమెత్తితే తనను పోలీసులు అర్దరాత్రి అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారని విరుచుకుపడ్డారు బండి సంజయ్. తెలంగాణ ప్రజలకు అండగా ఉండేందుకు పులి వేట ప్రారంభించిందని చేవెళ్ల విజయ సంకల్ప సభలో బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ తెలంగాణ అభివృద్దికి ఆటంకం కలిగిస్తున్నాడని విరుచుకుపడ్డారు.