ప్రభుత్వం ఇకనైనా నికృష్ట ఆలోచనలు మానుకోవాలి : బండి సంజయ్

-

తెలంగాణాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. తెలంగాణలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర నిలిపివేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో బండి సంజయ్ హై కోర్ట్ ను ఆశ్రయించారు. అయితే.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగింపునుక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి కుట్రల చేశారని మండిపడ్డారు. దాడులు, అక్రమ కేసులతో తన పాదయాత్రను కొనసాగనివ్వకుండా చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు బండి సంజయ్. ప్రభుత్వం ఇకనైనా నికృష్ట ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు బండి సంజయ్. రంగారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. అధికారిక కార్యక్రమంలో ప్రధానిపై ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తారా? అని ప్రశ్నించారు.

పాలమూరు ప్రాజెక్టును మోదీయే ఆపారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు బండి సంజయ్. పంటలు కావాలా, మంటలు కావాలా? అని కేసీఆర్ మాట్లాడుతున్నారని, వరి వేస్తే ఉరి అని చెప్పింది మీరు కాదా? అంటూ బండి సంజయ్ నిలదీశారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని అన్నారు. బీజేపీ పేరు చెప్పుకుంటూ కేసీఆరే ఘర్షణలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు బండి సంజయ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మత ఘర్షణలు లేవన్న విషయం గుర్తించాలని స్పష్టం చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version