యాసంగి పంట కొనబోమని మీకెవరు చెప్పారు? : టిఆర్ఎస్ ఎంపీలకు బండి సంజయ్ కౌంటర్

-

పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల తీరు పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎందుకీ డ్రామాలు….రైతులు చస్తున్నా వడ్లు కొనరా? రా రైస్ ఎంతైనా కొంటామని కేంద్రం చెబుతున్నా ఇదేం రాజకీయం.. సిగ్గు సిగ్గు అంటూ చురకలు అంటించారు. క్యాంటిన్ లో ప్లకార్డుల ఫొటోలు పట్టుకుని పార్లమెంట్ లో ధర్నా చేసినట్లు ఫోజులిస్తారా? అను ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు లోక్ సభలో గొడవ చేస్తుండగా బండి సంజయ్ కుమార్ అడ్డుకున్నారు.

వానా కాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. ధాన్యం కొనే దిక్కులేక వరి కుప్పలపై పడి రైతులు ప్రాణాలిడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. టీఆర్ఎస్ ఎంపీలకు ధీటుగా బండి సంజయ్ నినాదాలు చేస్తూ ఆ పార్టీ సభ్యుల తీరును ఎండగట్టారు. బండి సంజయ్ తోపాటు బీజేపీ ఎంపీ సోయం బాబూరావు సభలో లేచి నిలబడి టీఆర్ఎస్ ఎంపీల నినాదాలకు ప్రతి నినాదాలు చేశారు.

‘‘ఎందుకీ డ్రామాలు? యాసంగి పంట కొనబోమని మీకెవరు చెప్పారు? రా రైస్ పక్కా కొంటాం. ఇదే మాట కేంద్రం చెబుతున్నా డ్రామాలెందుకు? వానా కాలం పంట ఎందుకు కొనడం లేదని అడుగుతుంటే యాసంగి పేరుతో ఈ డ్రామాలేంది? కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో ధాన్యం వానకు తడుస్తూ మొలకలెత్తున్నా ఎందుకు కొనడం లేదన్ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version