బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లపై బండి సంజయ్ సమీక్ష

-

బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లపై బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో ఈ ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’లు చర్చనీయాంశంగా మారాయి. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ అధిక సంఖ్యలో మీటింగ్ లు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల చేరువలో ఈ ‘‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్’’లు నిర్వహించారు.

గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని పార్టీ నేతలకు బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ నాయకులు ఉత్సాహంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల్లో పాల్గొంటూ స్థానిక సమస్యలపై చర్చించడంతోపాటు కేసీఆర్ పాలనా వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విజయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేడంలో సఫలీక్రుతం అయ్యారని అన్నారు బండి సంజయ్. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల సంఖ్య 8 వేలకు చేరువలో ఉందని కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట నియోజకవర్గాల్లోనూ ఇచ్చిన టార్గెట్ లో 80 శాతం మేరకు మీటింగ్ లు నిర్వహించినట్లు తెలిపారు. ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు జరిగాయన్నారు. ఈ మీటింగ్ లలో స్థానిక సమస్యల పైనే ఎక్కువ చర్చ జరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version