చాలా మంది డబ్బులని బ్యాంకుల్లో పెట్టుకుంటూ వుంటారు. బ్యాంక్‌లో డబ్బులని ఎఫ్‌డీ చేసుకోవచ్చు. అధిక వడ్డీ రేటు బ్యాంకు అందిస్తున్నాయి కనుక ఇలా లాభాన్ని పొందొచ్చు. మీ డబ్బులు ని మీరు రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే ఇదే బెస్ట్ ఆప్షన్. కెనరా బ్యాంక్ తాజాగా ఎఫ్‌డీ రేట్లను సవరించింది. ఇక వివరాల లోకి వెళితే.. కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు ఆగస్ట్ 12 నుండి అమలు లోకి వచ్చాయి. కనుక ఇక్కడ డబ్బులు దాచుకోవాలని అనుకుంటే మంచిగా వడ్డీ వస్తుంది.
ఇక ఎంత వడ్డీ వస్తుంది అనేది చూస్తే.. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్ లోని ఎఫ్‌డీలపై 4 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు 7.75 శాతం వరకు వడ్డీ వస్తుందట. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతంగా, 46 నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 5.25 శాతం వడ్డీ వస్తుంది. ఇది ఇలా ఉంటే 91 నుంచి 179 రోజుల కి అయితే 5.5 శాతం, 180 నుంచి 269 రోజుల ఎఫ్‌డీ మీద చూస్తే 6.25 శాతం వడ్డీ మీకు వస్తుంది.
270 రోజుల నుంచి ఏడాది లోపు ఎఫ్‌డీలపై 6.5 శాతం వడ్డీ. ఏడాది డిపాజిట్లపై 6.9 శాతం. 444 రోజుల స్పెషల్ ఎఫ్‌డీపై 7.25 శాతం వడ్డీ పొందొచ్చు. ఇది ఇలా ఉండగా ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై 6.9 శాతం. రెండేళ్ల నుంచి 3 ఏళ్ల కి 6.85 శాతం. అలానే మూడేళ్ల నుంచి ఐదేళ్ల కి 6 శాతం. ఆపైన అయితే 6.7 శాతం వడ్డీ . సీనియర్ సిటిజన్స్‌కు గరిష్టంగా పదేళ్ల టెన్యూర్‌పై 7.2 శాతం వడ్డీ వస్తుందట. పదేళ్ల టెన్యూర్‌తో డబ్బులు దాచుకుంటే మెచ్యూరిటీ టైం కి మీకు రెట్టింపు డబ్బులు పొందొచ్చు. రూ. 5 లక్షలు ఎఫ్‌డీ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 10 లక్షలకు పైనే వస్తాయట. మెచ్యూరిటీ కన్నా ముందే తీసుకుంటే ఒక శాతం పెనాల్టీ పడుతుంది.