సౌత్ ఇండియాలో బన్ని సెన్సేషనల్ రికార్డ్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో సెన్సేషనల్ రికార్డు సాధించారు. సోషల్ మీడియా పరంగా అరుదైన ఘనత సాధించాడు.తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న హీరోగా రికార్డ్ అందుకున్నాడు.దీంతో 25 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న తొలి దక్షిణాది సినీ నటుడిగా అల్లు అర్జున్ రికార్డులకెక్కారు. ఇక బన్నీ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ (21.3 మిలియన్లు), రామ్ చరణ్ (20.8 M), కేరళ నటుడు దుల్కర్ సల్మాన్ (14.1M), కేజిఎఫ్ హీరో యశ్ (13.5 М), మహేష్ బాబు (13.4M), రెబల్ స్టార్ ప్రభాస్ (11.7M), విజయ్ దళపతి (10.8 M) ఉన్నారు.

కాగా, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నాడు. పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version