అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు, డెమొక్రటిక్ నాయకుడు బరాక్ ఒబామా విరుచుకుపడ్డారు. అహంకారి, అసమర్థుడు, ప్రజల మధ్య చిచ్చుపెట్టే నాయకుడు మనకు అవసరం లేదని చెప్పారు. పిట్స్ బర్గ్ లో నిర్వహించిన డెమొక్రటిక్ ప్రచారంలో ఒబామా మాట్లాడారు. ట్రంప్ అనే వ్యక్తిని మనం నాలుగేళ్ల పాటు భరించలేమన్నారు. ఒకరిపై ఒకరు తిరగబడే పరిస్థితి రాకుండా కలిసి పని చేసేలా ఉత్తమమైన పేజీ మన కోసం సిద్ధం అవుతోందని తెలిపారు.
బైడెన్ ప్రభుత్వం రిపబ్లికన్లు తుపాన్ సాయం అందించలేదంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను కొట్టి పారేశారు. బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి వివక్ష ఉండదన్నారు. అమెరికా విలువలకు ఉల్లంఘించవద్దని ట్రంప్ కి సూచించారు. రిపబ్లికన్ అభ్యర్థి కమలా హారిస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కమలా హారిస్ కి మద్దతుగా ఒబామా ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.