చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చెంతన ఉన్న ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల ఆందోళన 5వ రోజుకు చేరింది. ప్రభుత్వం స్పందించకపోవడం పై విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ ఇస్తున్నహామీలు తోసిపుచ్చారు. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు స్పష్టం చేశారు.ఈ ఆందోళనలపై ప్రభుత్వం సీరియస్ అయింది.
క్యాంపస్ కు సెలవులు ప్రకటించే యోచనలో సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది. క్యాంపస్ కు సెలవులు ఇస్తే విద్యార్థులు ఇళ్ళకు వెళ్ళిపోతారు అని అధికారులు భావిస్తున్నారు. గతంలో విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాంపస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.