రూ.250 తో రూ.62 లక్షల రిటర్న్స్ పొందొచ్చు..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది తమ దగ్గర డబ్బులో కొంత మొత్తాన్ని స్కీమ్స్ లో పెట్టి పొదుపు చెయ్యాలని అనుకుంటున్నారు. ఇలా పొదుపు చెయ్యడం వలన తరవాత ఎక్కువ డబ్బులు వస్తాయి. మీరు కూడా ఏదైనా స్కీమ్ లో డబ్బులని పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ స్కీమ్ గురించి తప్పక చూడాల్సిందే. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

money

పీపీఎఫ్ స్కీమ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచిగా లాభాలు వస్తాయి. ఇందులో ఎవరైనా పొదుపు చేయొచ్చు. పన్ను లాభాలు కూడా ఉంటాయి. పైగా ఇందులో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ ఉండదు. పీపీఎఫ్ అకౌంట్‌లో 15 ఏళ్ల వరకు పొదుపు చేయొచ్చు. ఒకవేళ 15 ఏళ్ల తర్వాత కూడా డబ్బులు అవసరం లేకపోతే ఈ స్కీమ్ ని మీరు ఎక్స్టెండ్ చేసుకుని మరో ఐదేళ్ల పాటు డబ్బుల్ని పెట్టచ్చు.

ఈ స్కీమ్‌కు ఎగ్జెంప్ట్ ఎగ్జెంప్ట్ ఎగ్జెంప్ట్ రూల్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీకి కూడా పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ కి వడ్డీ రేటు వార్షికంగా 7.1 శాతం లభిస్తోంది. ప్రతీ ఏటా రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్లు పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.41 లక్షల రిటర్న్స్ వస్తాయి.

అంటే రోజూ మీరు రూ.250 చొప్పున జమ చేస్తే రూ.62 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. 25 ఏళ్ల వయస్సు వున్నవాళ్లు 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రోజుకు రూ.250 చొప్పున నెలకు రూ.7,500 జమ చేయాలి. అంటే 365 రోజులకు లెక్కేస్తే రూ.91,250 జమ చేయాలి. మొత్తం రూ.62.5 లక్షల రిటర్న్స్ వస్తాయి. భారీ మొత్తంలోనే ఇన్వెస్ట్ చెయ్యాలని లేదు. కావాలంటే రూ.500 చొప్పున జమ చేయొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version