కెసిఆర్ నిర్లక్ష్యం వల్లే భద్రాచలం ముంపుకు గురైందన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ముఖ్యమంత్రి అయిన కొత్తలో భద్రాచలానికి వచ్చిన కేసీఆర్.. మళ్లీ మొన్నటి వరదలకు అదికూడా వరదలు వచ్చిన వారం రోజుల తర్వాత తీరిక చేసుకుని వచ్చారని అన్నారు. వచ్చినా కూడా ఎవరిని పరామర్శించరలేదని, బాధితులతో మాట్లాడలేదని అన్నారు. కట్టమీద నిలబడి పిట్ట కథలు చెప్పి వెళ్లిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం వల్లె ఈ ముప్పు వచ్చిందన్న పువ్వాడ అజయ్ ముందే ఎందుకు మాట్లాడలేదని అన్నారు. పోలవరం వల్లే ముప్పు ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ముందే ఎందుకు మాట్లాడుకోలేదని, స్వీట్లు తినిపించుకున్నప్పుడు తెలియదా అని మండిపడ్డారు. మాటనిలపెట్టుకోలేని హామీలతో కేసీఆర్ పబ్బం గడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట నిర్మించి ఉంటే ఈ ప్రమాదం పొంచి ఉండేది కాదని అన్నారు వైయస్ షర్మిల.