పోలవరంతో భద్రాచలానికి ఎలాంటి ముంపు లేదు – కేంద్రం

-

పోలవరంతో భద్రాచలానికి ఎలాంటి ముంపు లేదని ప్రకటించింది కేంద్రం. పోలవరంపై ముగిసిన నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల వర్చువల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పై ఇప్పటికే అధ్యయనం చేయించామని స్పష్టం చేసిన కేంద్రం… 2009, 2011లలో పోలవరం బ్యాక్ వాటర్ పై శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని తెలిపింది. ముంపు ప్రభావంపై ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు అపోహలు పడుతున్నాయన్న కేంద్రం… భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్యా లేదని స్పష్టం చేసింది.

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా మూడు రాష్ట్రాల్లో అడుగులో మూడో వంతు ముంపు ప్రభావం కూడా ఉండదన్న కేంద్ర జల సంఘం… ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ సిద్ధమైనా ఒడిశా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని వెల్లడించింది. మరోమారు బ్యాక్ వాటర్ సర్వే చేయించాలని కోరిన తెలంగాణా వాదనను తోసిపుచ్చింది కేంద్రం.

గోదావరి ట్రిబ్యునల్ సిఫార్సుల మేరకు 36 లక్షల వరద జలాలు వెళ్లేలా స్పిల్ వే కట్టాలని ఉన్నా ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా ప్రాజెక్టు పూర్తి అవుతున్నట్టు పేర్కొంది. బ్యాక్ వాటర్ సర్వేకు సంబధించిన సాంకేతిక అంశాలపై మరో మారు భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7 తేదీన నాలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది కేంద్ర జలశక్తి శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version