ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి గురించి మాట్లాడే అర్హత అనితకు లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత మండిపడ్డారు. మహిళలను నమ్మించే మోసం చేసే పార్టీ టీడీపీ అని, అనితకు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతుందంటూ పోతుల సునీత విమర్శించారు. భారతి గారంటే ఆమెకు భయం ఉండటం సహజమని, చంద్రబాబు మాట్లాడిస్తున్న మాటలు ఇవి…ఆయనవి నీతిమాలిన రాజకీయాలు అంటూ పోతుల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వారికి భారతమ్మను చూస్తే భయం ఉంటుందని, జగన్ ఇంత చిన్న వయసులో ఇంత మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి వారికి బాధ ఉంటుందన్నారు పోతుల సునీత.
కేంద్రం నుంచి వచ్చినవి, రాష్ట్ర ఆదాయాన్ని పేద ప్రజల కోసం ఖర్చు చేశారని, తప్పుడు మాట్లాడితే మాత్రం ఏపీ ప్రజలు సహించరన్నారు. మీరు రాజకీయాలు చేయాలంటే ఒక పద్ధతిగా చేయండి….ఇంట్లో మహిళలను బయటకు లాగొద్దని, లేదంటే చంద్రబాబు, లోకేష్ కి మహిళలు బుద్ది చెప్తారన్నారు పోతుల సునీత. సూట్ కేసులు దాచుకునే నీచమైన వ్యవహారం మీదని, పోలవరాన్ని ఏటీఎం చేసుకుంది మీరని ఆమె మండిపడ్డారు. ఇలాంటి దోపిడీ చూసే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని, మీరు చేసిన దానికి ప్రజలు బుద్ధి చెప్పారంటూ పోతుల సునీత ధ్వజమెత్తారు. 2024లోనూ మీకు అధోగతి తప్పదని పోతుల సునీత వ్యాఖ్యానించారు.