మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా మరియు కీర్తి సురేష్ కీలక పాత్రలు చేస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్ నుండి ఒక అప్డేట్ తాజాగా వచ్చింది. ఇటీవలే భోళా శంకర్ నుండి టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ మధ్యన చిరు నుండి వచ్చిన వాల్తేరు వీరయ్య సక్సెస్ ను అందుకోగా.. ఇప్పుడు వరుసగా మరో సినిమాను సక్సెస్ చేయడానికి టీం అంతా కస్టపడి పనిచేస్తోంది. గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న భోళాశంకర్ షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం తెలియచేసింది. ఈ సినిమాకు చిరంజీవికి వీరాభిమాని అయిన మెహర్ రమేష్ దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించాడు. కాగా షూటింగ్ ముగిసిన అనంతరం మెహర్ రమేష్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం టీం మొత్తం విశ్రాంతి అనేది లేకుండా పని చేశామని తెలిపారు.
“భోళా శంకర్” షూటింగ్ పూర్తి…. ఆనందంలో మెగా ఫ్యాన్స్!
-