అషూ రెడ్డి ఫోటోషూట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ జెస్సీ..!!

-

గతంలో రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న అషూ రెడ్డి ఆ తర్వాత వయ్యారాలు వలకబోస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకు మతి పోగొట్టే ఈ ముద్దుగుమ్మ పలు ఐటమ్ సాంగ్ లకి కవర్ సాంగులు చేస్తూ జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత బిగ్ బాస్ లో స్థానం సంపాదించుకొని బిగ్ బాస్ ఓటీటీ లో నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక వార్తతో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.

బిగ్ బాస్ షోలో ఈమె పాల్గొన్నప్పటికీ అంతకుమించి పాపులారిటీ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఈమెకు లభించిందని చెప్పాలి . అందాల ప్రదర్శన.. కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు.. అలాగే రాహుల్ తో ఈమె నడిపిన ప్రేమాయణం అన్నీ కూడా ఈమెకు బాగా పాపులారిటీని తీసుకొచ్చాయి. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడం ఆయన పేరును టాటూగా వేసుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈమెకు పూర్తిస్థాయిలో సపోర్టుగా నిలిచారు. ఇకపోతే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఈమె చేసే ట్వీట్లు కూడా కాంట్రవర్సీలకు దారితీస్తూ ఉంటాయి..

తాజాగా తన ఫోటో షేర్ చేస్తూ తన వ్యక్తిత్వం గురించి తెలియజేసింది అషూ రెడ్డి.. తన గురించి తాను చెప్పుకుంటూ.. తనను నమ్మిన వ్యక్తికి.. తనలోని చెడు కోణాన్ని చూపించే టైపు తాను అంటూ చెప్పుకు రావడం గమనార్హం. అయితే ఈ పోస్టులో పిక్ కి క్రెడిట్ ఇవ్వలేదని జెస్సి గోల పెట్టేసాడు. అంతేకాదు హెయిర్ స్టైల్ క్రెడిట్ కూడా ఇవ్వలేదని మేకప్ మెన్ కి కూడా కామెంట్ పెట్టేసాడు జెస్సి. మంచి ఫొటోస్ పెట్టాలని ఆషూ రెడ్డిని కోరాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version