ప్రారంభమైన బిగ్ బాస్-7.. ఇంట్లో అడుగుపెట్టిన ప్రియాంక జైన్

-

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభం అయింది. ఇక అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహారిస్తున్న ఈ షోకు సంబంధించిన గ్రాండ్ కర్టెన్ రైజర్ ఈవెంట్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తొలి కంటెస్టెంట్ గా టీవీ నటి ప్రియాంక జైన్ బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించింది. కొత్త సీజన్ కావడంతో ఇంటి సెట్టింగ్ కూడా కొత్తగా ఉంది. గత సీజన్లతో పోల్చితే ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎక్స్ టీరియర్స్, ఇంటీరియర్స్ పూర్తిగా మార్చేశారు.

కలర్ ఫుల్ గా, రిచ్ నెస్ ఉట్టిపడేలా బిగ్ బాస్ ఇంటిని తీర్చిదిద్దారు. అయితే ఫర్నిచర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఎందుకో నాగార్జున వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే కంటెస్టెంట్లు కొన్ని టాస్క్ ల ద్వారా బిగ్ బాస్ ఇంటికి అవసరమైన ఫర్నిచర్ ను సంపాదించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రోమోలో చెప్పినట్టుగానే ఉల్టా పుల్టా ఖాయమని బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ చెబుతోంది.

 

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్-7లో శివాజీ రెండో కంటెస్టెంట్. బద్రి చిత్రంలోని బంగాళాఖాతంలో… పాట పాడుతూ బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించిన శివాజీకి తొలి కంటెస్టెంట్ ప్రియాంక జైన్ వెల్కమ్ చెప్పింది. ఆ తర్వాత మూడో కంటెస్టెంట్ గా సింగర్ దామిని భట్ల హౌస్ లోకి ఎంటరైంది. నాలుగో కంటెస్టెంట్ గా మోడల్ ప్రిన్స్ యావర్ ప్రవేశించాడు. బిగ్ బాస్ వేదికపై ప్రిన్స్ యావర్ తో హోస్ట్ నాగార్జున సంభాషణ ఆకట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version