Bigg Boss 5: లేట్ నైట్.. అది కూడా రెస్ట్ రూంలో హ‌గ్‌ల‌తో ర‌వి రెచ్చిపోతున్న‌డంట‌.. ఎవ‌రితోనో మ‌రీ! ప్రియ షాకింగ్ కామెంట్స్‌

-

Bigg Boss 5: బిగ్ బాస్ షో రచ్చ మ‌మూలుగా లేదు. వారం మొత్తం స‌ర‌దాగా ఉన్నా.. నామినేష‌న్ల స‌మయానికి కంటెస్టెంట్ల అసలు రంగును బయటపడుతుంది. ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుగుకుంటున్నారు. కొందరైతే నోరు కూడా జారుతున్నారు. మొత్తానికి ఈ ప్రక్రియ మాత్రం చాలా వాడివేడిగా జ‌రుగుతుంది.

బిగ్ బాస్‌లో నిన్నటి ఎపిసోడ్ మాత్రం ఓ రేంజ్ అనే చెప్పాలి. నామినేష‌న్‌లో కంటెస్టెంట్ల అంద‌రూ ప్రియను టార్గెట్ చేశారు. అయినా సరే ప్రియా మాత్రం .. అస‌లు త‌గ్గ‌లే.. వెనకడుగు వేయ్య‌కుండా అంద‌రికి క‌డిగిపాడేసింది.

ముందుగా లహరిని టార్గెట్ చేసింది ప్రియా. మేడ‌మ్ అబ్బాయిలతో చాలా బిజీ, అస‌లు లేడీస్ తో మాట్లాడ‌టం లేద‌ని అని షాకింగ్ కామెంట్ చేసింది. ప్రియ మాటాలకు రియాక్టయినా ల‌హ‌రి.. ఎవరితో బిజీగా ఉన్నానో చెప్పడండి అంటూ ప్రశ్నించింది. దానికి ప్రియా రవి పేరు చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన లహరి.. జాతీయ మీడియాలో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోకండి అని మండిపడింది.

రవితో ఏం చేశానో చెప్పాల‌ని లహరి అన్నది.. దాంతో ప్రియా ‘నువ్ రవితో రెస్ట్ రూంలో లేట్ నైట్ హగ్ చేసుకుంటూ ఉన్నావు .. అది ఫ్రెండ్లీ హగ్ అయినా అయ్యి ఉండొచ్చు.. ఏమైనా అయ్యి ఉండొచ్చు అని అన్నది ప్రియ. ఈ మాటాల‌తో కంటెస్టెంట్ల అంద‌రూ షాక్ అయ్యారు. ర‌వి బ్రదర్‌ బర్త్‌డే కోసం షర్ట్‌ పంపించమని కెమెరాల దగ్గర రిక్వెస్ట్‌ చేశానని, అతడు తనకు బ్రో మాత్రమేనంటూ ఏడ్చేసింది లహరి.

తర్వాత రవి వెంటనే అందుకొని.. ఏంటక్కా ఏమాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించాడు. మిడ్‌నైట్‌ హగ్గు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌ అని ఎదురు ప్ర‌శ్నించాడు. మ‌ళ్లీ రియాక్ట‌యినా ప్రియ‌.. ‘మీరు హగ్ చేసుకున్నది మిడ్ నైట్ కాదా? టాయ్ లెట్‌లో కాదా? అని తిరిగి ప్రశ్నించింది. దాంతో రవి సహనం కోల్పోయాడు.. అసలు ఏం మాట్లాడుతున్నావ్.. రాంగ్ స్టేట్ మెంట్.. రాంగ్ స్టేట్ మెంట్ అని గట్టిగా అరిచాడు. నేను లహరి కంటే సిరి, కాజల్‌తో ఎక్కువగా ఉంటాను, అన‌వ‌స‌రంగా లేని సమస్యల‌ను క్రియేట్ చేస్తున్నారు అని కడిగి పారేశాడు. దాంతో ఆగ్ర‌హానికి లోనైనా.. ప్రియ ఘాటుగా బదులిస్తూ.. ఆమె సింగిల్‌, ఏదైనా చేయగలదు అని షాకింగ్ రిప్లే ఇచ్చింది. దీంతో లహరి ఆస‌హ‌నానికి లోనైంది. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ సిరీయ‌స్ వార్నింగ్‌ ఇచ్చిప‌డేసింది.

ఆతర్వాత సన్నీని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. త‌న‌ బిహేవియర్ నచ్చలేదని చెప్పింది ప్రియ‌.. దీంతో.. ఎప్పుడూ కూల్‌గా ఉంటే సన్నీ సీరియస్ అయ్యాడు. ముందు మీ ప‌ద్ద‌తిని మార్చుకోండి.. అస‌లు ఒక అమ్మాయి గురించి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారా…? నన్ను వాడు వీడు అని మాట్లాడలేదా..? అని ప్ర‌శ్నించాడు. అస‌లు హగ్ చేసుకుంటే.. తప్పెంటీ? అదేమైనా బూతా..? అని ప్రియాను ఓ రేంజ్‌లో క‌డిపాడేశాడు స‌న్నీ. దీనికి ప్రియా ఏ మాత్రం త‌గ్గ‌కుండా గట్టిగానే రిప్లే ఇచ్చింది. నేను నీ గురించి మాట్లాడుతుంటే.. నువ్ వాళ్ల గురించి చెప్తున్నావ్.. సేఫ్ గేమ్ ఆడకు అని వార్నింగ్ ఇచ్చింది. ఈ స‌మ‌యంలో ర‌వి అందుకున్నాడు. మీ స్టేట్ మెంట్‌ని నా కూతురు చూస్తే ఏమనుకుంటుంది.. మీకు పిల్లలు లేరా.? ప్రియ‌ను క‌డిగిపాడేశాడు. అయినా ఏమాత్రం త‌గ్గ‌ని ప్రియ.. నేను చూసిందే చెప్పాను.. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నది ప్రియ. మొత్తం మీద ప్రియా మాత్రం.. రవి లహరి గుట్టు రట్టుచేసింది .

Read more RELATED
Recommended to you

Exit mobile version