ప్రేమ , పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..!

-

సినీ ఇండస్ట్రీ కి చెందిన సెలబ్రిటీల మధ్య సాధారణంగా లవ్ , డేటింగ్ అనే పదాలు వినిపిస్తూనే ఉంటాయి. వాస్తవానికి తమ మధ్య ఏమీ లేకపోయినా సరే వారి ప్రవర్తన.. చూసే జనాలకు అలా అనిపిస్తూ ఉంటుంది.. ఇది సహజం.. కానీ ఒక్కొక్కసారి అవి నిజం అవుతూ ఉంటాయి ..మరొకసారి వాటిని సెలబ్రిటీలే రివీల్ చేస్తూ ఉంటారు.. ఇకపోతే ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే చాలామంది సెలబ్రిటీలు నచ్చితే డేటింగ్ అంటూ కొనసాగుతారు.. నచ్చకపోతే వారిని వదిలేసి ఇంకొకరిని వివాహం చేసుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సెలబ్రిటీల మధ్య ఇలాంటి లవ్ ట్రాక్లు నడుస్తూనే ఉన్నాయి. కొంతమంది పెళ్లి వరకు వెళ్లగా మరికొంతమంది ప్రేమలో ఉన్నప్పుడే విడిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా తేజస్వి మదివాడ కూడా ప్రేమలో పడింది అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ కో కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్ తో ఆమె ప్రేమలో పడింది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మొన్నటి వరకు బిగ్ బాస్ జోడీ పేరిట స్టార్ మా నిర్వహించిన కార్యక్రమంలో వీళ్ళిద్దరూ కలిసి పలు రొమాంటిక్ సాంగులకు డాన్స్ వేసి అందరిని అలరించారు.

దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ దీనిపై తేజస్వి తాజాగా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను ఇంకా ఎవరితోనూ ప్రేమలో పడలేదు అని.. ఆ సమయం వస్తే కచ్చితంగా చెబుతాను అంటూ చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఇకపోతే అఖిల్ సార్థక్ తో తాను స్నేహం మాత్రమే చేస్తున్నట్లు తెలిపింది. ఇకపోతే తొలిసారి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఆ తర్వాత ఐస్క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version