బిగ్‌బాస్ సీజన్-8 ప్రొమో రిలీజ్.. ఫస్ట్ టాస్క్ ఏంటంటే?

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ గేమ్ షో సీజన్-8 ప్రొమో రానే వచ్చింది.అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభం కానుంది. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా కింగ్ నాగార్జున సీజన్-8కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.ఈ సారి సీజన్ ప్రారంభం అయ్యాక ఎటువంటి టాస్కులు ఉంటాయో? ప్రేక్షకుల ఆదరాభిమానాలను కంటెంస్టెంట్లు అందుకోగలరా? లేదా అనేది కొద్ది రోజుల్లో తెలియనుంది.

అయితే, సీజన్-8లో స్థానం దక్కించుకున్న కంటెస్టెంట్లు పెద్దగా తెలిసిన మొహాలు కాకపోవడం మైనస్‌గా భావించవచ్చు. ఒకరిద్దరు మినహా అన్ని కొత్త మొహాలే కనిపిస్తున్నాయి. గత సీజన్ లాగే ఈసారి కూడా సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకున్నారు. ఇక నేటి రాత్రి షో ప్రారంభం కానుండగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ‘పట్టుకోనే ఉండండి’ పేరుతో తొలి టాస్క్‌ను బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఇవ్వనున్నట్లు ప్రొమోలో తెలిసిపోతుంది. మొత్తానికి బిగ్ బాస్ నుంచి తొలిప్రోమో రావడంతో అభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తంచేస్తున్నారు.అయితే, ఈ సీజన్‌లో హాట్ ఫేవరెట్‌గా ఎవరు నిలుస్తారో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version