బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ముందే ఊహించి చెప్పగలిగే స్టామినా ప్రేక్షకులకు ఉంది. అందుకే ఒక్కొక్కసారి వారి అంచనాలే నిజమౌతూ వస్తూ ఉంటాయి. ఇక బుల్లితెరపై గొప్ప ఎంటర్టైన్మెంట్ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఐదవ సీజన్ పూర్తిచేసుకుని ఆరవ సీజన్లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు మూడో వారం కూడా మొదలైంది. ఇక కంటెస్టెంట్లు కూడా టైటిల్ విన్నర్ గా నిలవడానికి తమవంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ప్రతి ఆటలో కూడా తమ ప్రతిభను చూపిస్తూ తన స్ట్రాటజీ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు కంటెస్టెంట్స్. ఇక ఏది ఏమైనా వీరి తిప్పలు చూస్తుంటే ప్రేక్షకులు ముందే ఊహించి చెప్పేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు మరుసటి రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనే విషయాన్ని కూడా ప్రేక్షకులు ముందే ఊహించి చెప్పేస్తున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ గా ఎవరు నిలబడతారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ విషయాన్ని కూడా ప్రేక్షకులు ముందే చెప్పేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈసారి కచ్చితంగా టాప్ ఫినాలే లో ఎవరు ఉంటారో చెప్పకపోయినా కచ్చితంగా విన్నర్ ఎవరు అనేది మాత్రం ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కేవలం ఆడుతున్నది ఒకరు ఇద్దరు మాత్రమే. అందుకే విన్నర్ ఎవరో కూడా ముందే ఊహించేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అందరి నోళ్ళల్లో నానుతున్న పేరు గీతూ రాయల్.. కేవలం రెండు వారాల్లోనే గీతు పేరు ఎక్కువగా వినిపించడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి.
ఇక మిగతా సభ్యుల కంటే ఉత్సాహం ఎక్కువగా గీతూ రాయల్ కే ఉంది . ఆటలో కూడా తన స్ట్రాటజీ చూపిస్తుంది .ఏ చిన్న తప్పు దొరికినా సరే అవతల వారిని రఫ్పాడించేస్తోంది. అచ్చం బిందు మాధవిలా చేస్తోంది అంటూ కచ్చితంగా ఈమె టైటిల్ విన్నర్ గా నిలుస్తుందని ప్రేక్షకులు తమ ఊహాగానం వ్యక్తం చేస్తున్నారు.