బిపిన్ రావత్ కు విదేశీ సైనికాధికారుల, విదేశీ ప్రతినిధుల నివాళి..

-

దేశ తొలి సీడీఎస్ , త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మరణం దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ మరో 11 మంది సైనికులు మరణించారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటుగా ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. దేశంలోని రాజకీయ నాయకులు ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

మరోవైపు విదేశీ సైనికాధికారులు కూడా సీడీఎస్ బిపిన్ రావత్ తో తమకున్న అనుబంధన్నా నెమరువేసుకుంటున్నారు. నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలకు సంబంధించిన సైనికాధికారులు బిపిన్ రావత్ కు నివాళులు అర్పించారు. వీరితో పాటు ప్రాన్స్, బ్రిటన్, శ్రీలంక దేశాలకు చెందిన విదేశాంగ శాఖ ప్రతినిధులు బిపిన్  రావత్ కు నివాళులు అర్పించారు.

బిపిన్ రావత్ కు నివాళులు అర్పించిన వారిలో జనరల్ శవేంద్ర సిల్వా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు శ్రీలంక ఆర్మీ కమాండర్ అడ్మిరల్ రవీంద్ర చంద్రసిరి విజేగుణరత్నే (రిటైర్డ్), శ్రీలంక మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నారు. రాయల్ భూటాన్ ఆర్మీ నుంచి డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ బ్రిగేడియర్ దోర్జీ రించెన్, నేపాల్ ఆర్మీ నుంచి లెఫ్టినెంట్ జనరల్ బాల్ కృష్ణ కర్కి, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ సుప్రోబల్ జనసేవశ్రీ, బంగ్లాదేశ్ ఆర్మీ నుంచి ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్, లెఫ్టినెంట్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ లు బిపిన్ రావత్ కు నివాళులు అర్పించారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version