రాసిపెట్టుకోండి… టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయం- జీవీఎల్ నర్సింహరావు

-

5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు బీజేపీకి మరింత జోష్ నింపుతున్నాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక నెక్ట్ టార్గెట్ తెలుగు రాష్ట్రాలు.. ముఖ్యంగా తెలంగాణే అంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో గెలిచేందుకు ప్లాన్ సిద్ధం చేసే పనిలో ఉంది బీజేపీ పార్టీ.

తాజాగా ఎంపీ జీవీఎల్ నర్సింహరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ 2023 డిసెంబర్ లో టీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోతుంది. ఇది రాసిపెట్టుకోండి’’ అంటూ కామెంట్స్ చేశారు. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను, బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి వణుకు పుట్టడం ఖాయమని అన్నారు. దేశాన్ని రక్షిస్తానంటూ సొంతంగా బాధ్యతలు తీసుకున్న కేసీఆర్ భుజం ఈఫలితాలతో కుంగిపోవడం ఖాయమని అన్నారు. బీజేపీ పార్టీకి, మోదీ నాయకత్వంపై ఇంకా క్రేజ్ తగ్గలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోతున్న ఈ తరుణంలో బీజేపీనే తెలంగాణలో మేజర్ పార్టీ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ టైం పాస్ ఆక్టివిటీ అని ఆయన అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టుకుంటే… ఉన్న స్థానాలను కూడా టీఆర్ఎస్ పార్టీ కోల్పోతుందని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలకు బీజేపీ అంటే మరోసారి ఆలోచించుకోవాలిని జీవీఎల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news