పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బిజెపి సన్నాహాలు

-

పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బిజెపి సన్నాహాలు చేస్తోంది. ప్రతి ఏడాది వార్షిక పరీక్షలకు ముందు పరీక్ష పే చర్చ పేరుతో విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు ప్రధాని మోడీ. ఈ సారి ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచే విధంగా బిజెపి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం ను విద్యార్థుల్లో కి తీసుకెళ్లేందుకు వందలాది పాటశాలల్లో వివిధ రకాల పోటీలు నిర్వహిస్తోంది.

మోడీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాలను పంపిణీ చేస్తోంది. ఈ నెల 27 న ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా చాలా స్కూల్స్ లో విద్యార్థులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు బిజెపి శ్రేణులు. ఇప్పటికే ఈ ప్రోగ్రాంను సమన్వయం చేసుకునేందుకు కమిటీ వేసింది బిజెపి. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ఎజెండా లోనూ ఈ అంశాన్ని చేర్చింది. ఈ రోజు పలు పాటశాలల్లో జరిగిన కార్యక్రమాలు, బహుమతి ప్రదానోత్సవాల్లో పాల్గొన్నారు కిషన్ రెడీ, లక్ష్మన్, బిజెపి నేతలు. మోడీ పిలుపు మేరకు హెల్తీ బేబీ షో లు నిర్వహిస్తున్నారు బిజెపి నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version