నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకుల దాడిపై రచ్చ కొనసాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఈరోజు గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఈరోజు నందిపేటకు వెళ్లనున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నాయకులతో సంజయ్ నిజామాబాద్ బయలుదేరారు. దీంతో ఆర్మూర్ లో హై టెన్షన్ నెలకొంది. ఆర్మూర్ లో బీజేపీ కార్యకర్తలతో సమావేశంలో కూడా బండి సంజయ్ పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు బారిగా మోహరించారు. బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. బండి సంజయ్ పర్యటనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. బండి సంజయ్ ని ముందస్తు అరెస్ట్ చేేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రైతులే దాడి చేశారని టీఆర్ఎస్ అంటుంటే.. టీఆర్ఎస్ కార్యకర్తలే దాడులు చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చెలరేగుతున్నాయి.
ఆర్మూర్ లో హై టెన్షన్ … కార్యకర్తలను పరామర్శించేందుకు బయలుదేరిన బండి సంజయ్
-